Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అందరి ఆరోగ్యంతోనే మెరుగైన సమాజ నిర్మాణం 

అందరి ఆరోగ్యంతోనే మెరుగైన సమాజ నిర్మాణం 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను
ప్రతి ఒక్కరి ఆరోగ్యంతోనే మెరుగైన సమాజ నిర్మాణం జరుగుతుందని ఆలేరు మున్సిపల్ చైర్మన్ బాలమణి భాస్కర్, పిహెచ్సి వైద్యాధికారి హైమావతి అన్నారు. ఆలేరు పట్టణంలో శనివారం పోచమ్మ దేవాలయం, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం రెండో సెంటర్ వద్ద, పట్టణ ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా హెల్త్ క్యాంపు నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ వార్డులకు చెందిన ప్రజలు హెల్త్ క్యాంపులో బిపి ,షుగర్ ,థైరాయిడ్, ఇతర సంబంధిత వ్యాధులపై ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకున్నారు. వారికి అనుగుణంగా పిహెచ్సి హెల్త్ సెంటర్ ఉపకేంద్రం వైద్యాధికారి కె.సాయి తేజ మందులు పంపిణీ చేశారు. ఆలేరు పట్టణంలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రలకి సొంత భవనం నిర్మాణం చేపట్టాలని, దానికి స్థలం కేటాయిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ అయ్యేలా చూడాలని మున్సిపల్ చైర్మన్ దృష్టికి  డాక్టర్లు తీసుకువెళ్లారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య నిర్మాణంలో కీలకంగా పని చేస్తాయన్నారు. అనంతరం వైద్య సిబ్బంది మున్సిపల్ చైర్మన్ బీజనా బాలమణి భాస్కర్ , వార్డ్ కౌన్సిలర్లు బొట్ల సంపతు,జట్ట నీరజలకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య ఉపకేంద్రం వైద్య సిబ్బంది, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -