Tuesday, September 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆరోగ్య సమాజ నిర్మాణం సాధ్యం

ఆరోగ్య సమాజ నిర్మాణం సాధ్యం

- Advertisement -

నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రోగులు, వారి కుటుంబసభ్యులు, వైద్య సిబ్బంది అందరూ కలసి ముందుకు సాగితేనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ లోని నిమ్స్‌ ఆస్పత్రిలో క్రానిక్‌ మైలాయిడ్‌ ల్యూకేమియా (సీఎంఎల్‌) డే వేడుకలు నిర్వహించారు. వేడుకలను ప్రారంభించిన అనంతరం బీరప్ప మాట్లాడుతూ అవగాహన కార్యక్రమాలు వైద్యరంగానికే కాకుండా సమాజానికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ధైర్యాన్ని ఇస్తాయని చెప్పారు. మెడికల్‌ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సదాశివుడు గుండేటి మాట్లాడుతూ క్రానిక్‌ మైలాయిడ్‌ ల్యూకేమియాపై అపోహలు పెట్టుకోకుండా, సమయానికి వైద్యపరీక్షలు చేయించుకోవడం ద్వారా దీని ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు. మాక్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో రోగులకు ఉచితంగా ప్రాణరక్షక ఔషధాలు అందిస్తున్నట్టు తెలిపారు. క్యాన్సర్‌ వంటి వ్యాధులను తొందరగా గుర్తించడం, సరైన చికిత్స అందించడం ద్వారా రోగుల జీవన అవకాశాలు గణనీయంగా పెంచుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మందికిపైగా క్రానిక్‌ మైలాయిడ్‌ ల్యూకేమియా రోగులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -