Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి..

విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం): మండల కేంద్రమైన కాటారం గ్రామానికి చెందిన దాడిచెర్ల అశోక్ అనే రైతుకు చెందిన రూ.45 వేలు విలువైన దుక్కిటెద్దు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎద్దు యజమాని పూర్తి కథనం ప్రకారం వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో సోమవారం ఉదయం మేతకు విడిసిపెట్టగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ పార్మర్ సపోర్ట్ తిగకు తగిలి విద్యుత్ షాక్ తో మరణించిందని కన్నీరుమున్నీరైయ్యాడు.రైతు విద్యుత్ శాఖ అధికారులకు, వెటర్నరీ డాక్టర్ కు సమాచారం ఇవ్వగా మృతిచెందిన ఎద్దును పరిశీలించారు, చనిపోయిన ఎద్దు విలువ సుమారు 45 వేలు ఉంటుందని యజమాని అశోక్ తమకు తగిన నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అధికారులు కూడా రైతుకు ప్రభుత్వం పరంగా సహాయం అందేలాగా  కృషి చేస్తామని రైతుకు హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -