Friday, July 18, 2025
E-PAPER
Homeఆటలుటాప్‌లో బుమ్రా, రూట్‌

టాప్‌లో బుమ్రా, రూట్‌

- Advertisement -

ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ విడుదల
దుబాయ్:
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. బౌలర్ల జాబితాలో జస్ప్రీత్‌ బుమ్రా, బ్యాటర్ల జాబితాలో జో రూట్‌ అగ్రస్థానంలో నిలిచారు. తాజా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో భారత ఆటగాళ్లు ముగ్గురు నిలిచారు. జో రూట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 104, రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేయడంతో టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 888 పాయింట్లు ఉన్నారు. ఇక మరో ఇంగ్లండ్‌ ప్లేయర్‌ హ్యారీ బ్రూక్‌ రెండుస్థానాలు దిగజారి మూడోస్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్‌ సీనియర్‌ ప్లేయర్‌ కేన్‌ విలియమన్స్‌ రెండోస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ ఒక స్థానం దిగజారి ఐదోస్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బావుమా ఆరు, శ్రీలంక ప్లేయర్‌ కమిందు మెండిస్‌ ఏడు, టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ఎనిమిది, కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ తొమ్మిదో స్థానాల్లో ఉన్నారు. ఇక పదో స్థానంలో ఇంగ్లండ్‌ ప్లేయర్‌ జేమీ స్మిత్‌ నిలిచాడు. అయితే, లార్డ్స్‌లో 72 పరుగులు, 61 నాటౌట్‌గా నిలిచిన జడేజా ఐదు స్థానాలు ఎగబాకి 34వ స్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌ టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా నెంబర్‌ వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం బుమ్రా ఖాతాలో 901 పాయింట్లు ఉన్నాయి. ఇక దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబాడా రెండోస్థానంలో, స్కాట్‌ బోలాండ్‌(ఆస్ట్రేలియా) ఆరు స్థానాలు ఎగబాకి కెరీర్‌లో అత్యుత్తమంగా ఆరో స్థానానికి చేరుకున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌లో 62 వికెట్లు 16.53 సగటుతో వికెట్లు తీసిన బోలాండ్‌.. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమర్స్‌ జార్జ్‌ లోహ్మాన్‌, సిడ్నీ బార్న్స్‌ మాత్రమే మెరుగైన సగటుతో వికెట్లు పడగొట్టారు. పాట్‌ కమ్మిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, నాథన్‌ లియాన్‌, మిచెల్‌ స్టార్క్‌లతో ఐసీసీ ర్యాంకింగ్స్‌ టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్నాడు. 1958లో ఇంగ్లండ్‌ జట్టు టాప్‌-12లో ఆరుగురు బౌలర్లు ఉండగా.. తాజాగా ఐదుగురు ఆస్ట్రేలియా బౌలర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌ టాప్‌-10లో చోటు దక్కించుకోవడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -