Sunday, August 3, 2025
E-PAPER
Homeసినిమా'బన్‌ బటర్‌ జామ్‌' రిలీజ్‌కి రెడీ

‘బన్‌ బటర్‌ జామ్‌’ రిలీజ్‌కి రెడీ

- Advertisement -

రాజు జెయమోహన్‌, ఆధ్య ప్రసాద్‌, భవ్య త్రిఖ హీరో,హీరోయిన్లుగా రాఘవ్‌ మిర్‌దత్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బన్‌ బటర్‌ జామ్‌’.
సురేష్‌ సుబ్రమణియన్‌ సమర్పకుడిగా రెయిన్‌ ఆఫ్‌ ఎరోస్‌, సురేష్‌ సుబ్రమణియన్‌ నిర్మించిన ఫన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. తమిళంలో రిలీజై విశేష ప్రేక్షకాదరణతో సూపర్‌ హిట్‌ అయ్యింది. ఈ మూవీని తెలుగులో ఈనెల 8న శ్రీ విఘ్నేశ్వర ఎంటైన్మెంట్స్‌ బ్యానర్‌ పై సిహెచ్‌ సతీష్‌ కుమార్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం దర్శకుడు మెహర్‌ రమేష్‌ టీజర్‌ను విడుదల చేసి, సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.
‘తల్లిదండ్రులైన చార్లి, శరణ్య పొన్‌ వనన్‌ టీజర్‌లో తమ కొడుకు గొప్పతనం గురించి మరొకరితో ఫోన్‌లో చెబుతుంటారు. మరో వైపు హీరో క్యారెక్టర్‌ను ఫన్నీగా ప్రజెంట్‌ చేశారు. అలాగే హీరో, హీరోయిన్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ను కూడా ఎంటర్‌టైనింగ్‌ వేలోనే చూపించటం కొస మెరుపు. సునిశితమైన ఎమోషన్‌, అన్‌స్టాపబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని టీజర్‌ చెప్పకనే చెప్పింది. రాఘవ్‌ మిర్‌దత్‌ ఫన్నీగా సినిమాను తెరకెక్కించిన తీరు, నివాస్‌ కె.ప్రసన్న సంగీతం, బాబు కుమార్‌ సినిమాటోగ్రఫీ సినిమాని సూపర్‌హిట్‌ చేశాయి. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది’ అని నిర్మాత సిహెచ్‌. సతీష్‌కుమార్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -