– ఉపాధి హామీ చట్ట నిర్వీర్యానికి కేంద్రం ప్రయత్నం
– చట్టం రద్దును వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు
నవతెలంగాణ-విలేకరులు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ.. దాని స్థానంలో వికసిత్ భారత్- గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ (వీబీ జీ రాy్‌ు జీ) బిల్లును తీసుకొచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. పార్లమెంట్‌లో ఏకంపక్షంగా ఆమోదించు కుంది. దీన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం పలు జిల్లాల్లో సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బిల్లు ప్రతులను దహనం చేశారు. గద్వాల జిల్లా కేంద్రం లోని అలంపూర్ చౌరస్తాలో బిల్లు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీరాం నాయక్ మాట్లాడుతూ.. ప్రజల ఉపాధికి తూట్లు పొడవ డమే దేశభక్తా అని బీజేపీని ప్రశ్నించారు. వామ పక్షాల పోరాటంతో సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ 2025 పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడలో నిరసన తెలిపారు. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం రేమద్దుల గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. అమరచింత మండలం పామిరెడ్డిపల్లిలో బిల్లు ప్రతులను దహనం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని మహబూబ్‌నగర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ మండలంలోని ఎర్రవల్లి, జైదుపల్లి గ్రామాల్లో బిల్లు పత్రులను దహనం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లో బిల్లు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ములుగు జిల్లా పస్త్రాలో, వెంక టాపురంలోని తళ్లపహాడ్ సెంటర్‌లో బిల్లు ప్రతులు దహనం చేశారు. మహబూబాబాద్, బయ్యారంలో ప్రతులు దహనం చేశారు. ఆత్మకూరు మండలం మూలమల్లలో బిల్లు ప్రతులు దహనం చేసి గ్రామ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డిలో బిల్లు ప్రతులు దహనం చేసి నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం పాండవుల బస్తీలో జీ రామ్ జీ జీవో ప్రతులను దహనం చేశారు.
‘వీబీ జీ రామ్‌జీ ‘బిల్లుల దహనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



