- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కర్నూలు జిల్లాలో ఈనెల 24న జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి గురైన బస్సును అధికారులు రోడ్డు పక్కన పెట్టగా, మృతుల ఒంటిపై ఉన్న విలువైన ఆభరణాలు కాలిపోయి ఉంటాయని భావించి కొందరు వ్యక్తులు వాటి కోసం వెతుకుతున్నారు. ఘటనాస్థలంలో ఉన్న బూడిదను దగ్గర్లో ఉన్న కుంటలో కడుగుతూ బంగారం కోసం వెతుకుతున్నారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
- Advertisement -



