Friday, December 12, 2025
E-PAPER
Homeజాతీయంబస్సు ప్రమాదం..ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సర్కార్‌

బస్సు ప్రమాదం..ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సర్కార్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అల్లూరి జిల్లా చింతూరు ఘాట్‌ రోడ్డులో యాత్రికులతో వెళ్తున్న ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు లోయలో పడి 9 మంది మరణించారు. 27 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్రం నుంచి మరో రూ. 2లక్షలు క్షతగాత్రులకు రూ.2లక్షలు పరిహారంగా ప్రకటించింది. ఈ సందర్భంగా చింతూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను మంత్రులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, అనిత పరామర్శించారు. మంత్రి అనిత మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రమాదంలో చనిపోవడం బాధాకరమని అన్నారు. శీతాకాలంలో ఘాట్‌రోడ్డులో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలు నిలిపివేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -