- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రమాద స్థలానికి చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యను స్థానికులు అడ్డుకున్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ప్రజలు, ఎమ్మెల్యేపై రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు. పోలీసులతో వాగ్వాదం జరగ్గా, బస్సును అక్కడి నుండి తొలగించవద్దని స్థానికులు కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య కారులో అక్కడి నుండి వెళ్లిపోయారు.
- Advertisement -



