- Advertisement -
నవతెలంగాణ చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయం 7.05 గంటల సమయంలో చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్.. బస్సును ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమాయంలో బస్సులో70 మంది ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది తాండూరు, చేవెళ్లకు చెందినవారే ఉన్నారు. తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ కాంట్రాక్ట్ టీచర్‌గా పనిచేస్తున్న జయసుధతో పాటు మరికొందరు నడుములోతు కంకరలో ఇరుక్కుని బయటకు రాలేకపోయారు.
- Advertisement -



