- Advertisement -
నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం లో సోమవారం ఉదయం సబ్స్టేషన్ సమీపంలో బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో సబ్ స్టేషన్ పల్లెకు చెందిన మాచర్ల మల్లేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ద్విచక్ర వాహనం బస్సు టైర్ల కింద పడి నుజ్జు అయింది. మాచర్ల మల్లేష్ పరిస్థితి విషమించడంతో స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించి అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -