- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: ప్రయాణికుల బస్సు మధ్య ఇరాన్‌లో బోల్తా పడిన ఘటనలో 13 మంది మృత్యువాత పడ్డారు. మరో పది మందికి పైగా గాయపడ్డారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఆర్‌ఎన్‌ఏ న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. సోమవారం ఆలస్యంగా ఇస్ఫాహాన్ నుండి ఈశాన్య నగరమైన మషాద్‌కు బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
బస్సు హైవే మధ్యలో ఉన్న సెంట్రల్ గార్డ్ రైల్‌ను ఢీకొని, ఎదురు లేన్‌లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఒక టాక్సీని ఢీకొని బోల్తా పడినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో బస్సులోని 11 మంది ప్రయాణికులు, టాక్సీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మొత్తం 13 మంది మృతిచెందారు.
- Advertisement -



