Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్లారీని ఢీకొట్టిన బస్సు

లారీని ఢీకొట్టిన బస్సు

- Advertisement -

– నలుగురు మృతి
– 10 మందికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ- జడ్చర్ల

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద శుక్రవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. జడ్చర్ల సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సీజీఆర్‌ ట్రావెల్‌ బస్సు గురువారం రాత్రి కడప నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని అతివేగంతో ఢీకొట్ట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌ నరసింహ, క్లీనర్‌ నర్సింలు, హైదరాబాద్‌కు చెందిన ప్రయాణికులు లకీëదేవి, రాధిక అక్కడికక్కడే మృతిచెందారు. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మితిమీరిన వేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఆయాన్‌, అరుణ కమల్‌, భాష, విజయ జ్యోతి, జయ ప్రసాద్‌, మహేందర్‌, శీను, నేహా, సుల్తానా, రామలక్ష్మమ్మ, షాషా హుస్సేన్‌, మహబూబ్‌ చాంద్‌, శ్రావణ్‌ కుమార్‌, శివారెడ్డితోపాటు మరికొందరు గాయపడ్డారు. వారందరినీ మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ప్రమాదం జరిగిన సమయంలోనే అదే రోడ్డు గుండా వెళ్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి గమనించి వాహనాన్ని ఆపి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad