క్షత్రగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ శివారులో కామారెడ్డి సిరిసిల్ల రహదారిలో ప్రయివేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణ శివారులోని సిరిసిల్ల బైపాస్ రోడ్డు జాతీయ రహదారిపై అదుపు తప్పి ప్రయివేట్ బస్సు బోల్తా పడింది. బస్సు బోల్తాపడిన చోట ఇటీవల వర్షాలకు రహదారి కోతకు గురైంది. దాంతో రోడ్డు పక్కన ఓ గుంతలో బస్సు బోల్తా పడింది. ఆ బస్సు నాగపూర్ నుంచి హైదరాబాద్ కు వెళోంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని స్థానికులు తెలిపారు.
బస్సు బోల్తా.. పలువురికి గాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES