నవతెలంగాణ మద్నూర్
అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం. ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. మద్నూర్ మండలం తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా సరిహద్దులో మహారాష్ట్రకు కర్ణాటక రాష్ట్రాలకు బార్డర్లో ఉంది. ఈ మండలం నుండి ప్రయాణికులు దూరప్రాంతాలకు వెళ్లాలంటే బస్సు సర్వీసులు సమయపాలన లేకుండా నడవడం ప్రయాణికులకు ఉదయం గాని రాత్రి పూట గాని ఎక్కడినుండి ఎక్కడికి వెళ్లాలన్నా తిరిగి ఇంటికి రావాలన్నా సమయపాలన లేని బస్సు సర్వీస్ లతో ఈ మండల ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కో వలసి వస్తుందని ప్రయాణికుల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది.
మద్నూర్ మండల ప్రజలకు ప్రతిరోజు ఉదయం మబ్బున 5 గంటల బస్సు సర్వీసు వెళ్లింది అంటే ఇక ఉదయం 8 గంటల వరకు బస్సు సర్వీసే లేదు మూడు గంటలపాటు ప్రయాణికులు బస్సు సర్వీస్ కోసం ఎదురు చూడవలసి వస్తుంది. ఇటునుంచి ఉదయం 3:00 గంటలు బస్సు సర్వీసు కోసం ఎదురు చూడవలసి రాగా ఇక బాన్సువాడ నుండి ఇటు మండలానికి రావడానికి రాత్రి 6:30 గంటలకు మాత్రమే బస్సు సర్వీసు ఉంది అది దాటి వెళ్ళింది అంటే ఇక రాత్రి పది గంటల వరకు బాన్సువాడ నుండి మద్నూర్ వైపు బస్సు సర్వీసులు లేవు. రాత్రి అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే బాన్సువాడలో మూడున్నర గంటలు ప్రయాణికులు వెయిటింగ్ చేయవలసిందే ఇలాంటి బస్సు సర్వీసుల మూలంగా ఈ ప్రాంత ప్రజలు ఉదయం రాత్రి రెండు రకాల సమయంలో గంటల తరబడి బస్సులు లేక ఇబ్బందులు పడవలసి వస్తుందని ప్రయాణికుల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది.
బాన్సువాడ డిపో ఆర్టీసీ అధికారులు ఈ మారుమూల మండల ప్రజల కోసం బస్సు సర్వీసులు ఉదయం 5 గంటల తర్వాత గంట గంటకొక బస్సును నడపాలని కోరుతున్నారు. బాన్సువాడ నుండి రాత్రిపూట ఆరున్నర గంటల తర్వాత కూడా గంటకొక బస్సు మద్నూర్ మండలానికి సౌకర్యంగా కల్పించాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రానికి డైరెక్ట్ బస్సు ఉదయం 7 గంటలకు ఒకటి నడపాలని ఈ మండల ప్రజలు ఆర్టీసీ అధికారులకు కోరుకుంటున్నారు.
జిల్లా కేంద్రానికి డైరెక్ట్ బస్సు సౌకర్యం లేక రెండు మూడు చోట్ల దిగడం ఎక్కడం జిల్లా కేంద్రానికి వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉందని ప్రతిరోజు ఉదయం మద్నూర్ మండల కేంద్రం నుండి 7 గంటల సమయంలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి డైరెక్ట్ బస్సు నడుపుతే అక్కడికి ఉదయం 10 గంటల వరకు చేరుకోవచ్చని ప్రజలు ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదయం రాత్రి రెండు సమయాల్లో గంటల తరబడి బస్సు సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 5 గంటల తర్వాత గంటకొక బస్సు నడపాలని అదే విధంగా బాన్స్వాడ నుండి రాత్రిపూట ఆరున్నర తర్వాత బస్సు సౌకర్యాలు కల్పించి రాత్రి సమయంలో ప్రయాణికులు సరైన సమయానికి ఇంటికి చేరుకునే విధంగా ఆర్టీసీ అధికారులు ఆలోచించాలని ఈ మండల ప్రజలు ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రయాణికులకు బస్సు సౌకర్యాలు సమయపాలనగా నడిపే విధంగా ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించాలని గంటల తరబడి బస్సు సౌకర్యాలు లేక ఈ మారుమూల మండల ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.