నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండల కేంద్రం మీదిగా కామారెడ్డి బాన్సువాడ డిపోలకు చెందిన బస్సులు అను నిత్యం బస్సు సర్వీసులు నడుస్తూ ఉంటాయి. కామారెడ్డి నుండి బాన్సువాడకు సుమారుగా 60 కిలోమీటర్లు ఉంటుంది. కామారెడ్డి నుండి బాన్సువాడకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. అలాగే బాన్సువాడ నుండి కామారెడ్డికి ప్రతి 20 నిమిషాలకు గాంధారి మీదుగా బస్సు నడుస్తూ ఉంటాయి. గత ఏప్రిల్ నెల నుండి బాన్సువాడ డిపోకు చెందిన నాలుగు బస్సులు కామారెడ్డి డిపోకు చెందిన ఒక బస్సు సర్వీసును నడుపుతుంది. దీంతో కామారెడ్డి నుంచి బయలుదేరిన బస్సు పద్మా జీవాడి ఎక్స్ రోడ్డు గాంధారి మొండి సడక్ గ్రామాల్లో మాత్రమే బస్సు స్టాపులు మాత్రమే ఉన్నాయి.
దీంతో వేరే గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి సమయంలో ఆర్డినరీ బస్సులు లేకపోవడంతో వేరే గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో విద్యార్థులు, మండల పరిధిలోని ప్రజలు ప్రయివేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రయివేటు వాహన చోదకులు వాళ్ళ ఇష్టరీత్యా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. మా ఇబ్బందులను అర్థం చేసుకుని, ఇకనైనా ఆర్డినరీ బస్సు సర్వీసులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. స్కూలు ప్రారంభం కావడంతో ఆర్డినరీ బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి ఈ రూట్లో ఆర్డినరీ బస్సు సర్వీస్ లు పెంచాలని ప్రయాణికులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES