Tuesday, June 17, 2025
E-PAPER
Homeజిల్లాలుఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలి

ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలి

- Advertisement -

రవాణా శాఖాధికారికి వినతిపత్రం అందజేత
బీసీ విద్యార్థి సంఘం, తెలంగాణ జనసమితి(టీజేఎస్, గిరిజన విద్యార్థి సంఘాల(జి వి ఎస్) జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ – కామారెడ్డి

ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డికి సోమవారం బీసీ విద్యార్థి సంఘం, తెలంగాణ జన సమితి గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జిల్లా లో ఉన్నటువంటి ప్రయివేట్ పాఠశాలల యొక్క ఫిట్నెస్ లేని బస్ లను వెంటనే సీజ్ చేయాలన్నారు. పూర్తి ఫిట్నెస్ ఉండి అన్ని సదుపాయాలు ఉన్న బస్ లకు మాత్రమే అనుమతివ్వాలని,అనుభవం ఉండి 50 సంవత్సరాలు నిండని డ్రైవర్లను మాత్రమే వినియోగించాలన్నారు.ప్రతీ బస్ లో అత్యవసర ధ్వారం,ఫైర్ అలారం మంటలు ఆర్పే పరికరం,ప్రథమ చికిత్స కోసం బాక్స్, బస్ కిటికీలకు ఇనుప గ్రిల్స్,చిన్న పిల్లలు రోడ్డు దాటేటప్పుడు సహాయం కొరకు హెల్పర్ లు ఉండేలా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు కుంబాల లక్ష్మణ్ యాదవ్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సభావత్ వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -