Saturday, June 21, 2025
E-PAPER
Homeజిల్లాలుఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలి..

ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలి..

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలు, కళాశాల బస్సులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తూన్న బస్సులపై చట్టపరమైన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి అన్నారు. శనివారం పి.డి.ఎస్.యు అధ్వర్యంలో జిల్లా రవాణా శాఖ అధికారి ప్రకాష్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొన్ని ప్రైవేటు పాఠశాలలు కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఫిట్నెస్ లేకుండా బస్సులు నడిపిస్తున్నారని పరిమితి సంఖ్యలో కాకుండా అధిక మందిని విద్యార్థులను బస్సుల్లో ఇరికించి అనేక ప్రమాదాలకు దారి తీసే విధంగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.అనేకమార్లు తెలియజేసినప్పటికీ వినిపించుకోకుండా అదే తరహాలో కొనసాగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.అలాంటి యాజమాన్యాలపై జిల్లా రవాణా అధికారి చర్యలు తీసుకుని వెంటనే వాటి పర్మిషన్లను రద్దు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు, దూదిపాల ప్రవీణ్, మందడి శ్రీధర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -