Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నిరుపేద కుటుంబాలకు ఆసరా బుసిరెడ్డి పాండన్న

నిరుపేద కుటుంబాలకు ఆసరా బుసిరెడ్డి పాండన్న

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న ఆత్మబంధు కార్యక్రమంలో భాగంగా భోజనాలు పంపించారు. ప్రతిఒక్క నిరుపేదకు వెన్నుదన్నుగా నిలుస్తున్న  నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఆపద్భాందవుడిలా నిలుస్తున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అనుముల మండలం చల్మారెడ్డి గూడెం గ్రామానికి చెందిన ఇరిగిలి లింగమ్మ, హాలియా మున్సిపాలిటీకీ చెందిన నారుమల్ల వెంకటమ్మ, మృతి చెందారు.
విషయం తెలుసుకొని వారి కుటుంబాలకు అండగా ఒక్కొక్క కుటుంబానికి 100 చొప్పున భోజనాలు పంపించారు. అణగారిన వర్గాలకు, నిరుపేద కుటుంబాలకు మన ఆత్మబంధు ఎల్లప్పుడు అండగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డి గారు పిలుపునిచ్చారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ 9581742356-7799585859  ను సంప్రదించవలసినదిగా కోరారు. నిరుపేదలని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad