Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బుసిరెడ్డి సేవలు ఎంతో మందికి ఆదర్శం

బుసిరెడ్డి సేవలు ఎంతో మందికి ఆదర్శం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన వరి నాట్లు వేసే మహిళా రైతు కూలీలకు లంచ్ బ్యాగులను, చీరలను బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్బుసిరెడ్డి పాండన్న ఉచితంగా అందించారు. చీరెలు, లంచి బ్యాగులను తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి సోమవారం పంపిణి చేశారు. నియోజకవర్గం లో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు పిలిస్తే పలుకుతూ వారికి అండగా వుంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రజలు అతని సేవలను కొనియాడుతున్నారు. ఈ కార్యక్రమంలో  కొత్తపల్లి మాజీ ప్యాక్స్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి, నరసింహా రెడ్డి, పాతనబోయిన సైదయ్య, షేక్ అబ్దుల్ కరీం, ఫౌండేషన్ సభ్యులు మరియు మహిళా రైతు కూలీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img