కేశవపూర్ ప్రజలకు బీసీ జేఏసీ అభినందనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి బుట్టెంగారి మాధవరెడ్డి ఓటమి పాలయ్యారని బీసీ జేఏసీ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం బీసీ జేఏసీ చైర్మెన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ ద్రోహి మాధవరెడ్డిని ఓడించిన మూడుచింతలపల్లి మున్సిపాల్టీ కేశవాపూర్ వార్డు ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇప్పటికైనా మాధవరెడ్డికి టికెట్ ఇచ్చిన బీఆర్‌ఎస్, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీల ముందు బీఆర్‌ఎస్‌ను, మల్లారెడ్డిని దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. మాధవరెడ్డిని ఓడించాలని బీసీ జేఏసీ పిలుపునిచ్చిందని ఆయన గుర్తుచేశారు. మాధవరెడ్డిని ఓడించినట్టే బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులను భవిష్యత్తులో రాజకీయంగా భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.
బుట్టెంగారి మాధవరెడ్డి ఓటమి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



