కాంటాలు వేసి 20 రోజులు గడుస్తున్నా తరలించని వైనం
పలు జిల్లాల్లో జాతీయ రహదారులపై బైటాయించిన రైతులు
నవతెలంగాణ-కౌటాల/ఆర్మూర్/రాయికల్/చింతకాని
ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కాంటాలు వేసి 20 రోజులవుతున్నా కేంద్రాల్లో ధాన్యం ఉందంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం రైతులు ఆందోళనలు నిర్వహించారు. జాతీయ రహదారులపై తడిసిన ధాన్యంతో బైటాయించి రాస్తారోకో లు నిర్వహించారు. కుమురంభీం – ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేటలో రైతులు రోడ్డుపై బైటాయించారు. తేమ, తప్ప, తాలు అని తీవ్ర జాప్యం చేస్తూ ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆందో ళన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవు తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బా బు వెంటనే అక్కడికి చేరుకుని రైతులకు మద్దతు తెలిపి మాట్లాడారు. ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి తడిసిన ధాన్యాన్ని కొంటామని ఒకపక్క చెబుతూనే, రైతుల ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అనంత రం అడిషనల్ కలెక్టర్ డేవిడ్ రైతుల వద్దకు వచ్చి.. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హరీష్‌బాబు సివిల్ సప్లరు కమిషనర్ చౌహన్‌తో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు కమిషనర్ తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్టీ మామిడిపల్లి జాతీయ రహదారిపై తడిసిన వరి ధాన్యంతో రైతులు రాస్తారోకో నిర్వహించారు. వరి ధాన్యానికి మొలకలు వచ్చాయని, మూడు నాలుగు రోజుల నుంచి వర్షం కురుస్తున్నా త్వరితగతిన కొనుగోలు చేపట్టడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడిచినా ఇప్పటికీ కాంట కాలేదని వాపోయారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తొగటి భూమన్న మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ డివిజనల్ అధికారి రాజాగౌడ్ రాస్తారోకో చేస్తున్న రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడారు. త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీ రాంనగర్, సింగరావుపేట్ గ్రామాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా చేశారు. అయోధ్య గ్రామం వద్ద రాయికల్-జగిత్యాల ప్రధాన రహదారిపై బైటాయించారు. ఎస్‌ఐ సీహెచ్ సుధీర్ రావు, ఇన్‌చార్జి తహసీల్దార్ జె.గణేష్ రైతులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో వరి ధాన్యం కాటాలు వేసి 20 రోజులు గడుస్తున్నా వాటిని తరలించకుండా నిర్వహకులు వదిలేశారు. రెండు రోజుల కిందట వర్షం కురవడంతో ధాన్యం బస్తాలు పూర్తిగా తడిశాయి. అయినా అధికారులు మాత్రం ధాన్యాన్ని తరలించకుండా వదిలేశారు. దాంతో శుక్రవారం రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు.
తడిసిన ధాన్యాన్ని కొనాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES