- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డితో కూడా నామినేషన్ వేయించింది. ఇప్పటికే ఆ పార్టీ తరఫున మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఆ నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా విష్ణువర్ధన్‌రెడ్డితో నామినేషన్ వేయించారు.
- Advertisement -