- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ దృష్ట్యా హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గం పరిధిలో 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ జరగనున్న 11వ తేదీ సా.6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. అలాగే 14న ఉ.6 గంటల నుంచి 15 ఉ.6 గంటల వరకు కూడా పోలీస్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమన్నారు.
- Advertisement -



