– ముఖ్యమంత్రి పినరయి విజయన్
తిరువనంతపురం : ఈ ఏడాది నవంబర్ 1 నాటికి కేరళ పేదరిక రహిత రాష్ట్రంగా మారుతుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడిం చారు. తిరువనంతపురంలో శుక్రవారం ఎల్డీఎఫ్ ప్రభుత్వ నాలుగవ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజయన్ మాట్లాడుతూ.. దేశంలోనే కేరళ అత్యల్ప పేదరిక స్థాయిని కలిగి ఉంద న్నారు. బలమైన, సమర్థవంతమైన ప్రజా పంపిణీ వ్యవస్థతో ఇది సాధించగలిగామని, ఈ అభివృద్ధిని గత కొన్నేండ్లుగా తమ ప్రభుత్వం స్థిరంగా బలోపేతం చేస్తోందన్నారు. భవిష్యత్ దృష్ట్యా ప్రజా భాగస్వామ్య విధానాలను పారిశ్రామిక వ్యూహాలతో మిళితం చేయడం ద్వారా కేరళ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం కేరళ అని, నవంబర్ 1 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా మారుతుందని ఉద్ఘాటిం చారు. 2016లో ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేపట్టిన సమయంలో.. రాష్ట్రంలో పెట్టుబడి పరిస్థితులను మార్చడం ఆందోళన కలిగించే కీలకాంశాల్లో ఒకటిగా ఉందని గుర్తు చేసుకున్నారు. ఆందోళ నలు తొలగించేలా పారిశ్రామిక వేత్తలు, వాటా దారులతో తమ ప్రభుత్వం వివరణాత్మక చర్చలు జరిపిందని, పథకాల రూపకల్పనలో వారి అభిప్రా యాలను కూడా చేర్చామన్నారు. ఫలితంగా రాష్ట్రంలో వ్యాపారాలను సులభతరం చేసేందుకు అనువుగా చట్టాలను, నిబంధనలను సవరించా మని, అనేక నిర్మాణాత్మక సంస్కరణలను ప్రవేశ పెట్టామన్నారు. పథకాల్లో మార్పులతో పాటు పారి శ్రామికీకరణకు అనుగుణంగా సామాజిక దృక్ప థాన్ని కూడా మార్చాల్సిన అవసరాన్ని గుర్తించా మని, అందుకే కేరళలో ‘ఇయర్ ఆఫ్ ఎంటర్‌ప్రె న్యూర్‌షిప్’ను ప్రారంభించామన్నారు. ఈ నమూ నాను కేంద్ర ప్రభుత్వం జాతీయ నమూనాగా గుర్తించిందని విజయన్ హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి లభించాల్సిన హక్కులపై కేంద్రం సహాయనిరాకరణ
పన్ను ఆదాయ పంపిణీలో రాష్ట్రానికి లభిం చాల్సిన హక్కును కేంద్రం నిరాకరించిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పన్ను వాటాను న్యాయంగా కేంద్రం కేటాయించి వుంటే, 2022-23లో వరుసగా రూ.2,282 కోట్లు, 2023-24లో రూ.2.071 కోట్లు అదనంగా వచ్చేవన్నారు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల మొత్తం పన్ను ఆదాయంలో కేరళ వాటా 3.7శాతమన్నారు. ఇదే సమయంలో కేంద్రం నుంచి కేరళకు వచ్చిన పన్ను వాటా వరుసగా 1.53 శాతం, 1.13 శాతం మాత్రమేనని తెలిపారు. కేరళ జనాభా ఆధారంగా రాష్ట్రానికి 2.7శాతం వాటా రావాల్సి వుందని, ఇది అదనపు డిమాండ్ కాదని, కేరళకు రావాల్సిన నిజమైన వాటా అని అన్నారు.
నవంబర్ 1 నాటికిపేదరికం లేని రాష్ట్రంగా కేరళ
- Advertisement -
- Advertisement -