Wednesday, October 1, 2025
E-PAPER
Homeబీజినెస్భారత్‌లోకి బీవైడీ ప్రవేశం..!

భారత్‌లోకి బీవైడీ ప్రవేశం..!

- Advertisement -

త్వరలో ఆ కంపెనీ ప్రతినిధుల రాక
న్యూఢిల్లీ : చైనాకు చెందిన విద్యుత్‌ వాహనాల కంపెనీ బీవైడీ భారత్‌లో తన కార్యకలాపాల విస్తరణకు భారత ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలోనే బీవైడీ కంపెనీ ప్రతినిధులు భారత్‌ను సందర్శించనున్నారని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వారు తెలిపారు. ఇటీవల ప్రధాని మోడీ చైనా ప్రెసిడెంట్‌ జిన్‌పిన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెంపునకు సానుకూల చర్చలు జరిగాయి. ఇందులో బీవైడీ అంశం కూడా ఒక్కటని తెలుస్తోంది. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు, వాణిజ్య భాగస్వామ్యం, విస్తరణ అంశాలపై చర్చించడానికి బీవైడీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కెట్సు జాంగ్‌ త్వరలో భారత్‌ను సందర్శించనున్నారు. ఆయనతో పాటు కంపెనీ సీనియర్‌ మేనేజర్లు, ఇంజనీర్ల కోసం వీసా ప్రక్రియ జరుగుతుందని సమాచారం. ఇంతక్రితం బీవైడీ ప్రవేశానికి మోకాలడ్డు వేసింది. అమెరికా కంపెనీ టెస్లాకు ఎర్రతివాచీ పరిచి.. బీవైడీ పైనా కేంద్ర మంత్రులు తీవ్రంగా విషం గక్కిన ఘటనలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -