Tuesday, April 29, 2025

c

– ప్రపంచ బ్యాంక్‌ కోత
న్యూఢిల్లీ : భారత వృద్ధి రేటు అంచనాలకు ప్రపంచ బ్యాంక్‌ కోత పెట్టింది. దేశంలో మూలధన వ్యయాల తగ్గుదలకు తోడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో బలహీనత, అమెరికా విధాన అనిశ్చితి నేపథ్యంలో భారత జీడీపీ 0.4 శాతం తగ్గి 6.3 శాతానికి పరిమితం కావొచ్చని విశ్లేషించింది. ఇంతక్రితం ఈ అంచనా 6.7 శాతంగా ఉంది. భారత్‌లో ప్రయివేటు పెట్టుబడులు, ప్రభుత్వ మూలధన వ్యయాలు నెమ్మదించడం వల్ల గడిచిన 2024-25లోనూ వృద్ధి నిరాశపర్చిందని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకోలేదని వెల్లడించింది. గడిచిన 2024-25లో జీడీపీ 6.5 శాతానికి మందగించనుందని విశ్లేషించింది. ఇంతక్రితం రోజూ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) కూడా భారత జిడిపి అంచనాలకు కోత పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత 2025-26లో వృద్ధి 6.2 శాతానికి పరిమితం కావొచ్చని.. ఇంతక్రితం 6.5 శాతం అంచనాతో పోల్చితే 0.3 శాతం తగ్గనుందని ఐఎంఎఫ్‌ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img