అక్రమాలపై నిలదీస్తే గ్రూపు నుంచి తొలగించారు
బాధితురాలు గడ్డం పద్మ ఆరోపణ
నవతెలంగాణ – మల్హర్ రావు
16 సంవత్సరాల క్రితం గ్రూపు సిఏ అక్రమాలకు పాల్పడుతోందని నిలదీసిన నేపథ్యంలో తనను స్వశక్తి మహిళ గ్రూపు సంఘం నుంచి తొలగించారని చిన్నతూండ్ల గ్రామానికి చెందిన గడ్డం పద్మ ఆరోపించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను16 ఏళ్ల క్రితం శ్రీలక్ష్మీ పొదుపు సంఘంలో సభ్యురాలు ఉన్నప్పుడు దుబ్బపేట గ్రామానికి చెందిన సిఏ లౌడ్య రాజమ్మ చెసిన అక్రమాలపై నిలదీసిన నేపథ్యంలో తనను గ్రూపు నుంచి తొలగించినట్లుగా తెలిపారు.
తమను గ్రూపుల్లోకి తీసుకోవాలని సిఏ తోపాటు ఏపిఎం, సిసిలకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆరేళ్ళ క్రితం చిన్నతూండ్ల నుంచి దుబ్బపేట ప్రత్యేక జిపిగా ఏర్పాటు అయిన నేపథ్యంలో చిన్నతూoడ్లకు మరొక్క సీఏను ఏర్పాటు చేసి, స్వశక్తి మహిళ సంఘం గ్రూపులోకి తనను తీసుకోవాలని విన్నవించారు. లేదంటే ఉన్నతాధికారులకు పిర్యాదు చేయున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై ఏపిఎం రవిందర్ ను నవతెలంగాణ వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.
పద్మ అంగన్ వాడి టీచర్ కావడంతో ఈ విషయంపై సూపర్ వైజర్ భాగ్యలక్ష్మిని నవ తెలంగాణ వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆమె సైతం అందుబాటులోకి రాలేదు.



