- Advertisement -
స్వామివారికి కానుకగా రూ. 2,72,335
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని ఇసన్నపల్లి(రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి హుండీ లెక్కింపును శనివారం దేవాదాయశాఖ సహాయ కమిషనర్ వి విజయ రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామివారికి కానుకగా రు,2,72,335 నగదు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహన అధికారి ప్రభువు రామచంద్రం తెలిపారు. కార్యక్రమంలో ఇరు గ్రామాల సర్పంచులు దొక్కి లచ్చయ్య, బండి ప్రవీణ్, ఉప సర్పంచులు, ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, మహిళా సంఘ సేవ సమితి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



