Thursday, March 12, 2026
E-PAPER
Homeజిల్లాలుబిబిపేట ప్రభుత్వ హాస్పిటల్ లో(ఆ.ర్టి.ఐ) క్యాలెండర్ ఆవిష్కరణ

బిబిపేట ప్రభుత్వ హాస్పిటల్ లో(ఆ.ర్టి.ఐ) క్యాలెండర్ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి, బీబీపేట్

కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం (సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ-2005) నూతన క్యాలెండర్ 2026 ను డాక్టర్ సంతోష్ కుమార్, (ఎం.బి.బి.ఎస్ ) ఆర్.టి.ఐ బిబిపేట కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్ కుమార్, మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం, సామాన్య ప్రజలకు ఒక వరం లాంటిదని, ప్రతి పౌరుడు ఈ చట్టాన్ని వినియోగించుకోవాలని అన్నారు.

బిబిపేట ఆర్టిఐ మండల అధ్యక్షులు, (కామారెడ్డి జిల్లా అడ్వైజర్) ఎం. నాంపల్లి. మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడు చట్టాలను గౌరవించి తీరాలని, సమాచార హక్కు చట్టం వల్ల, గ్రామపంచాయతీ మొదలుకొని, పార్లమెంట్ వరకు, ప్రతి ఒక్క సమాచారాన్ని తెలుసుకునే హక్కు సామాన్య పౌరునికి, ఈ చట్టం ద్వారా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పండ్ల హనుమంతు, ప్రమీల, (సిహెచ్ఓ) ప్రభావతి, (హెచ్ఎస్ ) లతీఫ్, (ల్యాబ్ టెక్నీషియన్) లావణ్య, (నర్సింగ్ ఆఫీసర్) మహిళా సిబ్బంది. యాదమ్మ, రాధిక, సువర్ణ, సుకన్య, ఆయుష్షు విభాగం డాక్టర్. ఏం. విజయ, లక్ష్మణ్, రేఖ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -