- Advertisement -
భారత్, ఇంగ్లాండ్ నాల్గో టెస్టు
లండన్ : ఇంగ్లాండ్ స్పిన్నర్ లియాం డాసన్ ఎనిమిదేండ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చాడు. షోయబ్ బషీర్ గాయం బారిన పడగా.. భారత్‌తో నాల్గో టెస్టుకు సెలక్టర్లు డాసన్‌ను ఎంపిక చేశారు. భారత పర్యటనలో మెప్పించిన స్పిన్నర్ జాక్ లీచ్ అందుబాటులో ఉన్నప్పటికీ.. సెలక్షన్ కమిటీ డాసన్ వైపు మొగ్గుచూపింది. భారత్, ఇంగ్లాండ్ నాల్గో టెస్టు మాంచెస్టర్‌లో ఈ నెల 23 నుంచి ఆరంభం కానుంది. టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో ఇంగ్లాండ్ 2-1తో ముందంజలో ఉంది.
- Advertisement -