- Advertisement -
- – 5 పంచాయితీల్లో గ్రామసభలు నిర్వహణ…
నవతెలంగాణ – అశ్వారావుపేట - సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్, 7 వ, 8 వ ప్యాకేజీల భూ సేకరణ కోసం భూసేకరణ స్పెషల్ అడిషనల్ కలెక్టర్ జే.కార్తీక్, పాల్వంచ యూనిట్ 1 ఉత్తర్వులు మేరకు అశ్వారావుపేట మండలంలో గురువారం నిర్వహించిన గ్రామ సభలు ప్రశాంతంగా జరిగాయి. ఉప తహశీల్దార్ రామక్రిష్ణ ఇచ్చిన సమాచారం మేరకు పీసా చట్టం సెక్షన్ 4,భూసేకరణ చట్టం 2013 సెక్షన్ 41 ఎల్.ఎ ప్రకారం మండలంలోని 15 పంచాయితీల్లో నీటిపారుదల కాలువ నిర్మాణం చేపట్టడానికి 848.28 కుంటలు భూసేకరణ చేయుట కొరకు 5 పంచాయితీల్లో గ్రామసభలు నిర్వహించారు. గురువారం అచ్యుతాపురం,నారంవారిగూడెం,అశ్వారావుపేట,మద్దికొం, జమ్మిగూడెం నిర్వహించిన గ్రామసభల్లో 244.25 ఎకరాలకు సంబంధించి న వివరాలను,సర్వే నెంబర్ లను గ్రామ సభలో ప్రకటించారు. ఈ గ్రామ సభలో స్పెషల్ కలెక్టర్ కార్తీక్, ఐబీ డీఈఈ ఎల్. క్రిష్ణ, ఏఈఈ కేఎన్బీ క్రిష్ణ, డీ.టీ రామ క్రిష్ణ,ఆయా పంచాయితీల కార్యదర్శులు పాల్గొన్నారు.
- Advertisement -