Thursday, July 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్యాంకుకు అన్నివైపులా కెమెరాలు ఏర్పాటు చేయాలి: అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి

బ్యాంకుకు అన్నివైపులా కెమెరాలు ఏర్పాటు చేయాలి: అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
బ్యాంకుకు అన్ని వైపులా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి పట్టణ కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో మండలంలో ఉన్న అన్ని బ్యాంకుల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బ్యాంకు అధికారులకు తెలిపారు. ఏటీఎంల భద్రత, బ్యాంకులో అలారం నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ప్రజా భద్రతా చట్టం కింద బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేసి తగు జాగ్రత్తలు త్వరితగతిన తీసుకోవాలన్నారు.
గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు…
మండలంలోని అంతంపల్లి గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటుచేసిన 12 సీసీ కెమెరాలు అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి ప్రారంభించారు. సైబర్ నేరాలు, యువత మాదకద్రవ్యాల వినియోగం గురించి ప్రజలకు వివరించారు.  గ్రామ రక్షణ కొరకు గ్రామస్తులు అందరూ కలిసి కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ సంపత్ కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, ప్రభాకర్, స్రవంతి, బ్యాంకు అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -