- Advertisement -
- ప్రచారంలో ముందున్న కాంగ్రెస్
నవతెలంగాణ – పెద్దవూర
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం కుంకుడు చెట్టు తండా పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రామావత్ హేమ్లా నాయక్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ్ముడు మేమంతా నీ వెంటే అన్నట్లుగా గ్రామ ప్రజలు అధిక ఓటర్లు ఇప్పటికే గెలిచేసావని ప్రచారాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి బాటలో పడుతున్నాయని చెప్తూ ప్రచారం మంగళవారంలో దూసుకుపోతున్నారు అంటే పేరు ప్రచార బలం ఎలా ఉందో అర్థం చేసుకోక తప్పదేమో ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే బీఆర్ఎస్ అభ్యర్థి వెనుకబడే ఉన్నారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్ సిటీ లో బీకం పూర్తి చేశానని పేదరికం లో పుట్టిన గ్రామ అభివృద్ధి కోసం సేవా చేయాలానే కోరిక తో కాంగ్రెస్ అభ్యర్థి గా నామినేషన్ వేషానని తెలిపారు. - గ్రాస్థులు, సహకారంతో వచ్చిన నిధులతో నిస్పక్ష పాతంగా గ్రామసభలు నిర్వహించి గ్రామాభి వృద్దకి ఖర్చు చేస్తానని తెలిపారు. గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను, అర్హులైన వారికి పెన్షన్స్, ఇందిరమ్మ ఇళ్లను ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్రామంలోని సమస్యలను తీర్చేందుకు అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కుంకుడు చెట్టు తండ గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకే ఓటు వేసి తనను ఆశీర్వదించి, సర్పంచిగా గెలిపిస్తే కుంకుడు చెట్టు తండ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ రమావత్ చందు నాయక్, మల్లికార్జున్, వినోద్, లక్పతి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



