- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థులుగా పోటీకి దిగిన ముగ్గురు అభ్యర్థులు వినూత్న రీతిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దుబ్బాక మండలం రాజక్కపేటలో పాతకోటి పద్మ వెంకటేష్, కోమటిరెడ్డి మమత రాధ మనోహర్ రెడ్డి, బైఖరి మంజుల బాలరాజ్ లు సర్పంచ్ బరిలో నిలిచారు. అసెంబ్లీ (ఎమ్మెల్యే), లోక్ సభ (ఎంపీ) ఎన్నికల్లో వినియోగించే ప్రచార రథాల మాదిరిగానే ఇక్కడ కూడా అలాంటి ప్రచార వాహనాలను అభ్యర్థులు వినియోగిస్తున్నారు. తీరొక్క పాటలతో అభ్యర్థులు తమ మేనిఫెస్టోను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. వీరి ప్రచార శైలిని చూసి ఇవి సర్పంచి ఎన్నికలా..? అసెంబ్లీ ఎన్నికలా..? అంటూ గ్రామస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు.
- Advertisement -



