Sunday, April 12, 2026
E-PAPER
Homeసినిమాసకుటుంబ సమేతంగా చూడొచ్చు

సకుటుంబ సమేతంగా చూడొచ్చు

- Advertisement -

తిరువీర్‌ హీరోగా ఎస్‌.పి. దుర్గ నరేష్‌ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘పాపం ప్రతాప్‌స‌. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాకేశ్‌ రెడ్డి గడ్డం, రుద్రదేవ్‌ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
ఈటీవి విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్‌ నుంచి రాబోతున్న ఈ సినిమా ఈనెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్‌ ట్రైలర్‌ లాంచ్‌ చేశారు. హీరో అల్లరి నరేష్‌, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుక గ్రాండ్‌గా జరిగింది.
హీరో అల్లరి నరేష్‌ మాట్లాడుతూ,’రాధాకృష్ణ తెలుగుపై మంచి పట్టు ఉన్న మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఆయన ఈ సినిమాతో మళ్లీ రావడం చాలా ఆనందంగా ఉంది. తిరువీర్‌ ‘ప్రీ వెడ్డింగ్‌ షో’ సినిమాకి చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. అది చాలా మంచి సినిమా. ఈటీవీ విన్‌ సాయి, నితిన్‌ కంటెంట్‌ తీసుకొస్తే అది చాలా బాగుంటుందని నమ్మకం. ‘లిటిల్‌ హార్ట్స్‌’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ ఇలా వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్‌ కొడుతున్నారు. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్‌ కావాలని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.
‘రాధాకృష్ణ ఈ సినిమాలో అద్భుతమైన పాటలు అందిస్తున్నారని తెలిసింది. ట్రైలర్‌ చూస్తుంటే తిరువీర్‌ కంటే ప్రతాప్‌ క్యారెక్టర్‌ ఎక్కువగా కనిపించింది. డైరెక్టర్‌ నరేష్‌కు తెలుగు, కథపై మంచి పట్టు ఉందని ఈ ట్రైలర్‌ ద్వారా అర్థమవ టుతోంది. చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌ మెంట్‌ పుష్కలంగా ఉందని నమ్ముతున్నాను. ఈ సినిమా టికెట్‌ రూ.100 లోపే ఉంది. ఈ బంపర్‌ ఆఫర్‌ మళ్లీ దొరకదు’ అని డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ చెప్పారు. హీరో తిరువీర్‌ మాట్లాడుతూ,’ఈ సినిమా ఇవివి సత్యనారాయణ సినిమాలా అనిపిస్తుంది. ‘మగాడు అంటే ఏడవకూడదు, బాధపడకూడదు’ అంటారు. కానీ మగాడు కూడా మనిషే.. ఆ భావాన్ని ఈ సినిమాలో గొప్పగా చూపిం చారు. క్లైమాక్స్‌ అద్భుతంగా ఉంటుంది. ఈనెల 17న మీ దగ్గరలోని థియే టర్లకు వస్తాను. ‘పాపం ప్రతాప్‌’.. ‘వీర ప్రతాప్‌’అనిపించుకుంటాను’ అని తెలిపారు. ‘థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం తీసిన సినిమా ఇది. సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. ఇవివి సత్యనారాయణ, జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డి, శ్రీను వైట్ల సినిమాలను గుర్తుకు తెస్తుంది’ అని ఈటీవీ కంటెంట్‌ హెడ్‌ నితిన్‌ చక్రవర్తి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -