Friday, October 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపగలరు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపగలరు

- Advertisement -

పుతిన్‌ను ప్రభావితం చేయగలరు : జిన్‌పింగ్‌పై ట్రంప్‌ ప్రశంసలు
అనేక అంశాలపై సియోల్‌లో ఆయనతో చర్చిస్తా
అణ్వాయుధాలపై కూడా మాట్లాడవచ్చు


వాషింగ్టన్‌ : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ బలమైన నాయకుడని, ఆయన రష్యాను ప్రభావితం చేయగలరని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కొనియాడారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని ఆపే శక్తి ఆయనకు ఉన్నదని తెలిపారు. సియోల్‌లో వచ్చే వారం జరిగే అపెక్‌ సదస్సులో ఈ విషయంపై జిన్‌పింగ్‌తో చర్చిస్తానని చెప్పారు. వాణిజ్యం, సుంకాలు, రేర్‌ ఎర్త్‌ తదితర అంశాలపై కూడా మాట్లాడతానని అన్నారు. ‘రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని ఎలా ఆపాలన్న విషయంపై జిన్‌పింగ్‌తో చర్చిస్తా. చమురు ద్వారా ఆపాలా, ఇంధనం ద్వారా ఆపాలా లేక వేరే విధంగా ఆపాలా అనే విషయంపై సంప్రదిస్తా. ఆయన అంగీకరిస్తారనే అనుకుంటున్నాను’ అని నాటో కార్యదర్శి జనరల్‌ మార్క్‌ రట్‌తో సమావేశమైన సందర్భంగా విలేకరులకు చెప్పారు. సియోల్‌లో జరగబోయే అపెక్‌ సదస్సు సందర్భంగా ఇరువురు నేతల మధ్య కీలక భేటీ చోటుచేసుకునే అవకాశం ఉంది.

శాంతి చర్చల కంటే ముఖ్యమైన పలు అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు రావచ్చు. రేర్‌ ఎర్త్స్‌ నుంచి సోయాబీన్‌ వరకూ…వాణిజ్యంపై పురోగతి సాధిస్తానని ట్రంప్‌ ఆశాభావంతో ఉన్నారు. అణు అంశాలు కూడా చర్చకు రావచ్చునని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ‘మేము ఒప్పందం కుదుర్చుకుంటామని అనుకుంటున్నాను. రేర్‌ ఎర్త్‌తో పాటు ప్రధానంగా సోయాబీన్స్‌, రైతులపై ఒప్పందానికి వస్తాం. అణు అంశంపై కూడా కావచ్చు’ అని చెప్పారు. అంతర్జాతీయ ఫలితాలకు రూపం ఇవ్వడంలో జిన్‌పింగ్‌ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారని తాను విశ్వసిస్తున్నానని ట్రంప్‌ తెలిపారు. ‘ఆయన పుతిన్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తారని అనుకుంటున్నాను. ఆయన గౌరవనీయ వ్యక్తి. చాలా పెద్ద దేశానికి బలమైన నాయకుడు. మేమిద్దరం కలిసినప్పుడు తప్పనిసరిగా రష్యా, ఉక్రెయిన్‌ గురించి మాట్లాడుకుంటాం’ అని అమెరికా అధ్యక్షుడు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -