– రూ.16,700 కోట్ల డిపాజిట్ల సమీకరణ
బెంగళూరు : ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ ఉద్యోగులు డిపాజిట్ల సమీకరణలో భళా అనిపించుకున్నారు. డిపాజిట్ల వృద్ధి లేమితో సతమతమవుతున్న కెనరా బ్యాంకు చేపట్టిన వినూత్న కార్యక్రమంలో భాగంగా కేవలం 10 వారాల్లోనే రూ.16,700 కోట్లు సమీకరించారు. బ్యాంకులో పనిచేసే 82,000 మంది సిబ్బంది ఈ క్యాంపెయిన్‌లో పాల్గొని నిధుల సమీకరణ చేశారు. 2024 జనవరి 26న ప్రారంభమైన ఈ క్యాంపెయిన్‌లో తమ ఉద్యోగులు ఎంతో అంకితభావంతో పని చేశారని కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె సత్యనారాయణ రాజు తెలిపారు. కాసా లేదా రిటైల్ టర్మ్ డిపాజిట్ రూపంలో ఒక్కొక్కరూ రూ.10 లక్షలు తీసుకురావాలని కోరామన్నారు. కాసా బ్యాలెన్స్‌లలో కూడా స్థిరత్వం ఉన్నందున ఈ డ్రైవ్ మొత్తం వ్యాపారానికి సహాయపడిందని పేర్కొన్నారు. దీంతో కెనరా బ్యాంక్ బల్క్ డిపాజిట్లపై ఆధారపడటం కూడా తగ్గిందన్నారు.
కెనరా బ్యాంక్ ఉద్యోగులు భళా..
- Advertisement -
- Advertisement -