- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగ్లాదేశ్ ఎన్నికలను రద్దు చేయాలని నిషేధిత అవామీ లీగ్ పార్టీ డిమాండ్ చేసింది. నియంత యూనస్ నిర్వహించిన ఈ ఎలక్షన్స్ హాస్యాస్పదమని పేర్కొంది. నిన్న 3 గంటల వ్యవధిలో 14.96% ఓటింగ్ నమోదవ్వడం ప్రజా వ్యతిరేకతను చూపించిందని ఓ ప్రకటన రిలీజ్ చేసింది. రాబోయే రోజుల్లో అవామీ లీగ్ మద్దతుదారులపై దాడులు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి ప్రజాహిత ప్రభుత్వాన్ని స్థాపించాలని కోరింది.
- Advertisement -



