గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం : ప్రకటించిన మంత్రి దామోదర రాజనర్సింహ్మ
ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో రిజిస్ట్రీ ఏర్పాటు
ఇకపై పక్కాగా క్యాన్సర్ కేసుల గణాంకాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా గుర్తించింది. క్యాన్సర్ రిజిస్ట్రీని కూడా ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ్మ క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.
పక్కాగా ‘క్యాన్సర్’ గణాంకాలు
రాష్ట్రంలో నమోదైన ప్రతి క్యాన్సర్ కేసు వివరాలు పక్కాగా ఉండనున్నాయి. ఈ విరాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రీ చేసి ఉంచనుంది. సాధారణంగా అంటువ్యాధులను ప్రభుత్వాలు నోటిఫైడ్ డిసీజ్‌లుగా ప్రకటిస్తూ ఉంటాయి. కానీ రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న కేసుల దృష్టా రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్‌ను సైతం ‘నోటిఫైడ్’గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు కొన్ని నగరాల్లోనే ఇలా గుర్తిం చారు. సౌత్ ఇండియాలో మొట్ట మొదటిసారిగా తెలంగాణలో క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా గుర్తించారు. ప్రభుత్వం ఏదైనా వ్యాధిని నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటిస్తే.. ప్రభుత్వంతోపాటు ప్రయివేటు ఆస్పత్రుల్లో రోగులకు క్యాన్సర్ నిర్ధార అయితే వైద్యశాఖకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని ఆస్పత్రులు మాత్రమే క్యాన్సర్ కేసుల వివరాలను వైద్యశాఖకు తప్పితే చాలా వరకు కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రులు వివరాలను ప్రభుత్వానికి చెప్పడం లేదు. ఆయా ఆస్పత్రులను ఎన్నిసార్లు హెచ్చరించినా పెడచెవిన పెడుతుండటం.. రాష్ట్రంలో క్యాన్సర్ బాధితులు సైతం పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా గుర్తించడంతో ప్రభుత్వా స్పత్రులతోపాటు ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ప్రభుత్వానికి విధిగా క్యాన్సర్‌కు సంబంధిం చిన సమాచారం, వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం వద్ద క్యాన్సర్ కేసుల గణాంకాలు పక్కాగా ఉంటాయి.
‘ఎంఎన్‌జే’లో క్యాన్సర్ రిజిస్ట్రీ
క్యాన్సర్ రిజిస్త్రీ అంటే ఒక ఆస్పత్రిలో నమోదయ్యే క్యాన్సర్ కేసుల సమాచారాన్ని (వ్యాధి రకం, రోగి వయసు, నివసించే ప్రాంతం, చికిత్స విధానం మొదలైనవి) సేకరించి, నిక్షిప్తం చేసే వ్యవస్థ. ఈ వ్యవస్థ వల్ల అనేక ఉపయోగాలుం టాయి. రిజిస్ట్రీకి వచ్చే సమాచారం ఆధారంగా వ్యాధి తీవ్రతను గుర్తించడమేకాక ఏ ప్రాంతంలో ఏ రకమైన క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయో తెలుసుకోవచ్చు. క్యాన్సర్‌ను గుర్తించేందుకు, కారణాల విశ్లేషణకు రిజిస్త్రీలోని సమాచారం ఉపయోగపడుతుంది. ఈ విశ్లేషణలు, పరిశోధనల ఆధారంగా ఏ ప్రాంతంలో ఎక్కువ ఆస్పత్రులు, స్క్రీనింగ్ సెంటర్లు అవసరమో ప్రభుత్వం గుర్తిస్తుంది. చికిత్స అనంతరం రోగుల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయో కూడా సులభంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం క్యాన్సర్ రిజిస్త్రీలు కొన్ని ఆస్పత్రుల నుంచే సమా చారం తీసుకుంటున్నాయి. ప్రభుత్వం క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటించడంతో రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల నుంచి రిజిస్ట్రీకి సమాచారం అందుతుంది. అప్పుడు క్యాన్సర్ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కూడా సులభంగా కలుగుతుంది.
రాజ్యసభ కమిటీ సిఫారస్సు
ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), ఎన్ సీడీఐఆర్ (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫోమేటిక్ అండ్ రీసెర్చ్) ఆధ్వర్యంలో దేశంలో నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (ఎన్సీఆర్పీ) నడుస్తోంది. అయితే, దేశంలోని కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటించాయి. తెలంగాణలోని ప్రధాన నగరమైన హైదరాబాద్‌లో బలమైన రిజిస్త్రీలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్‌ను ఇప్పటి దాకా నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటించలేదు. ఇటీవల రాజ్యసభ కమిటీ కూడా క్యాన్సర్‌ను దేశవ్యాప్తంగా నోటిఫైడ్ డిసీజ్ ప్రకటించాలని సిఫారస్సు చేసింది. ఈ నేపథ్యంలో వివిధ రూపాల్లో కసరత్తు చేసిన ప్రభుత్వం చివరికి క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా గుర్తించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు త్వరంలోనే వెలువడనున్నాయి.
‘ఎంఎన్‌జే’లో డేటా రిజిస్ట్రీ
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో కొత్తగా నిర్ధారణ అయిన క్యాన్సర్ కేసుల వివరాలను ప్రభుత్వ క్యాన్సర్ రిజిస్ట్రీలో నమోదు చేస్తారు. ఆ వివరాలన్నీ హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రికి చేరుతాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన అన్ని కేసుల వివరాలు ‘ఎంఎన్‌జే’లోని రిజిస్ట్రీలో ఉంటాయి.
నోటిఫైడ్ డిసీజ్‌గా క్యాన్సర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



