ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఘటన
రిజిస్ట్రర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు
నవతెలంగాణ-మియాపూర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు నిర్వహించిన నాన్-టీచింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో ఇద్దరు అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్టు గచ్చిబౌలిలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రర్ డాక్టర్ దేవేష్ నిగమ్ ఫిర్యాదు చేసినట్టు గచ్చిబౌలి సీఐ బాలరాజు తెలిపారు. పరీక్ష సమయంలో అభ్యర్థులు మొబైల్ ఫోన్లు, మైక్రోఫోన్లు, బ్లూటూత్ ఇయర్‌ఫోన్లు వంటి నిషేధిత ఎలక్ట్రానిక్ పరికరాలను కలిగి ఉన్నారని, పరీక్ష రాసేటప్పుడు వీటిని ఉపయోగించారని తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా, నిందితులపై కేసు నమోదు చేశారు. హర్యానాకు చెందిన అనిల్ కుమార్, సతీష్ ఇద్దరిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని సీఐ తెలిపారు.
యూనివర్సిటీ ఉద్యోగాలకు అభ్యర్థుల మాల్ ప్రాక్టీస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



