నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభంతో ఎంతోమంది ఆశలు అడియాశ లయ అని అంటున్నారు. 42 శాతం రిజర్వేషన్ ప్రభుత్వం ప్రకటించిన హైకోర్టు స్టే ఇవ్వడం వల్ల పోటీ చేసే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు హైకోర్టు 42 శాతంతో రిజర్వేషన్లు ద్వారా విడుదల చేసిన రిజర్వేషన్లు అవి ఉంటాయా ఊడుతాయా అనే ఆలోచనలో అభ్యర్థులు అయోమయంలో గురైనట్టు తెలిపారు. ఇప్పటికే గ్రామాలలో ఎలక్షన్ల సందడి ప్రారంభమైంది స్టే తేవడం వల్ల అగ్గిమీద నీరు పోసినట్టు అని పలువురు చర్చిస్తున్నారు. స్టే ఎలా ఉంటుందో అని ఆందోళన చేస్తున్నారు 42% రిజర్వేషన్ తగ్గిస్తే ఈ రిజర్వేషన్లు మళ్ళీ మారుతాయి అని అంటున్నారు. కొందరికి రిజర్వేషన్లు అనుకూలంగా ఉండగా మరికొందరికి విరుద్ధంగా ఉన్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం హైకోర్టు తీర్పు వరకు వేచి ఉండలసిందె అని చర్చించుకుంటున్నారు.
హైకోర్ట్ స్టే తో అభ్యర్థులు అయోమయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES