– అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
నవతెలంగాణ-రాయికల్: మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ నామినేషన్ స్వీకరణ కేంద్రాలు,పలు పోలింగ్ కేంద్రాలను అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తీరును,నిర్వహణ విధానం,భద్రతా ఏర్పాట్లను ఆమే పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.నామినేషన్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ఎన్నికల నిబంధనల ప్రకారం 100 మీటర్ల పరిధి నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని,అనుమతి లేకుండా ఎవరిని నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతించవద్దని సూచించారు.అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ను కచ్చితంగా పాటించాలని అదనపు ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ సురేష్, ఎస్‌ఐ సుధీర్ రావు తదితరులు పాల్గొన్నారు.
అభ్యర్థులు ఎన్నికల నియమాలని పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



