గుట్టలో రాజుకున్న రాజకీయ వేడి
నవతెలంగాణ – యాదగిరి గుట్ట
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే గుట్టలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ స్ సీపీఐ బీజేపీ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ సీపీఐ అధికారిక పొత్తు తో ముందుకు వెళితే బీఆర్ ఎస్ బీజేపీ అనధికార పొత్తు తో సాగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కావడం తో గుట్ట మున్సిపాలిటీలో ఒక్క సారిగా రాజకీయ వేడి పెరిగింది. మున్సిపల్ 1 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా గతంలో పోటీ చేసి గెలిచిన గౌలీకర్ రాజేష్ మళ్లీ బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిగా గతం లో పోటీ చేసి ఓటమి చెందిన బోడ రాధ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ని పోటీ లో పెట్టడం లేదనే ప్రచారం ఉంది.2 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి గా బూడిద మధు బరిలో ఉండగా బీఆర్ ఎస్ అభ్యర్థి గా పాపట్ల నరహరి పోటీ చేస్తున్నారు.
ఈ వార్డ్ లో బీజేపీ పోటీ పై క్లారిటీ లేదు.3 వ వార్డు లో కాంగ్రెస్ నుండి బరిగే రాంచందర్ పోటీ చేస్తుండగా బీఆర్ ఎస్ అభ్యర్థి గా కొల వెంకటేష్ బరిలో ఉండనున్నారు.వార్డులో కూడా బీజేపీ అభ్యర్థి పోటీ చేసే అవకాశం లేనట్టు సమాచారం.4 వ వార్డ్ లో కాంగ్రెస్ అభ్యర్థి గా కటబత్తిని స్వప్న ఆంజనేయులు పోటీ చేయనుండగా బీఆర్ ఎస్,బీజేపీ,అభ్యర్థుల పేర్ల పై చర్చ జరుగుతుంది.5 వ వార్డ్ లో కాంగ్రెస్ నుండి బిట్టు సరోజ హరీశ్ పోటీ చేయనుండగా బీఆర్ ఎస్ నుండి మనుపాటి ప్రేమలత పరుశురాం లేదా ధీరావత్ జాన్సి వీరేందర్ పోటీ చేయనున్నారు.6 వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా తాళ్ల ప్రియ శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయనుండగా,బీజేపీ తరపున కర్రే స్వాతి ప్రవీణ్ పోటీ చేయనున్నారు.ఈ వార్డ్ లో బీఆర్ ఎస్ అభ్యర్థి ని పోటి పెట్టడం లేదనే ప్రచారం జరుగుతోంది.7 వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పెలిమెల్లి లావణ్య శ్రీధర్ బరిలో నిలిచారు.బీఆర్ ఎస్ నుండి ఆరే జయమ్మ శ్రీధర్ గౌడ్,పోటీ చేస్తున్నారు.
8 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా ముక్కేర్ల మల్లేశం లేదా ముక్కేర్ల వెంకటేష్ బీఆర్ ఎస్ అభ్యర్థి గా పేరబోయిన సత్యనారాయణ లేదా ముక్కేర్ల సత్యనారాయణ బరిలో ఉండనున్నారు.9 వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా సాధునేని ధన లక్ష్మిమధుకర్ బీఆర్ ఎస్ అభ్యర్థి గా దండెబోయిన లాస్య అనిల్ యాదవ్ లు పోటీ పడనున్నారు.10 వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ నుండి గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ బీఆర్ ఎస్ పార్టీ నుండి ఆవుల మమత సాయి యాదవ్ లు తల పడనున్నారు.11 వ వార్డు అభ్యర్థులుగా కాంగ్రెస్ నుండి సీసా కృష్ణ లేదా ముక్కర్ల మల్లేశం బీఆర్ ఎస్ నుండి మిర్యాల దుర్గ ప్రసాద్, గుండ్ల పల్లి వంశీ బరిలో నిలిచే అవకాశముంది.12 వ వార్డు నుండి కాంగ్రెస్ సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా బబ్బూరి శ్రీధర్ బరిలో నిలిచారు బీజేపీ నుండి బందారపు మల్లేశం లేదా రచ్చ శ్రీను లేదా రంగ సత్యం,లు పోటీ పడనున్నట్లు సమాచారం.మొత్తం 12 వార్డులో పొత్తు ల లో భాగంగా కాంగ్రెస్ 11 సీపీఐ 1,బీఆర్ఎస్,బీజేపీఅంతర్గత పొత్తుల్లో భాగంగా బీఆర్ఎస్ 9 స్థానాల్లో బీజేపీ 3 స్థానాల్లో పోటీ చేస్తాయనే ప్రచారం జరుగుతోంది.



