– నిందితుల అరెస్టుకు 48 గంటల గడువు
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ బీబీపేట్ మండల నాయకులు
నవతెలంగాణ – కామారెడ్డి, బీబీపేట్
బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డా. విశారదన్ మహరాజ్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా, కుమ్మెర గ్రామంలో బీసీ రజక (చాకలి) కుటుంబంపై జరిగిన దాడి, అలాగే రెండు నెలల పసిపాప మృతికి నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ బిబిపేట్ మండల నాయకులు మాట్లాడుతూ.. ఘటనకు బాధ్యులైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. అలాగే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయకపోతే భవిష్యత్తులో భారీ స్థాయి నిరసనలు చేపడతామని హెచ్చరించారు. రజక సంఘం పెద్దలు గౌరయ్య, శ్రీనివాస్, సత్యం, మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ మండల నాయకులు లక్ష్మణ్, లింగం తదితరులు హాజరయ్యారు.
నాగర్‌కర్నూల్ ఘటనపై కామారెడ్డిలో కొవ్వొత్తుల ర్యాలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



