![]() |
నవతెలంగాణ – బాల్కొండ : కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్ర దాడికి నిరసనగా బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం నుండి రామ మందిరం వరకు పాత జాతీయ రహదారి గుండా ర్యాలీ కొనసాగింది. మాజీ ఎంపిటిసి రామ్ రాజ్ గౌడ్, సీనియర్ నాయకులు షేక్ రహీముద్దీన్, అశోక్, అఖిల్, బూపిరెడ్డి, ప్రవీణ్, రాజు గౌడ్, కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపిలకు చెందిన కార్యకర్తలు, వివిధ యువజన సంఘాల సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
- Advertisement -