నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం రెడ్డీస్ యూత్ ఆధ్వర్యంలో దేశం కోసం వీరమరణం పొందిన జవాన్లకు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన పోరులో వీర మరణం పొందిన జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు రెడ్డీస్ యూత్ సభ్యులు మాట్లాడుతూ భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పోరాటానికి భారతీయులుగా మనమంతా గర్వపడాలన్నారు.ఉగ్రవాదం అంతం కావాల్సిందేనని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న ఏ దేశంలో ఉన్న ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేది తప్ప లాభం చేకూర్చేది కాదని పేర్కొన్నారు. ప్రపంచ శక్తులన్ని ఏకమై ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయన్నారు. యుద్ధ సమయంలో ప్రజలంతా ఏకతాటిపై నిలబడి సరిహద్దుల్లో పోరాడుతున్న సైన్యానికి వెన్నుదన్నుగా మేమున్నామని భరోసా ఇవ్వాలన్నారు.
అమరులైన జవాన్లకు కొవ్వొత్తులతో నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES