Thursday, October 30, 2025
E-PAPER
Homeఖమ్మంమణుగూరులో గంజాయి స్వాధీనం... 

మణుగూరులో గంజాయి స్వాధీనం… 

- Advertisement -

డీఎస్పివి రవీంద్రారెడ్డి
నవతెలంగాణ – మణుగూరు
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్ ఏరియా లో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని మణుగూరు సబ్ డివిజన్ డి.ఎస్.పి వి రవీంద్రారెడ్డి తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైతన్య డ్రగ్స్ పై యుద్ధం  కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో చైతన్యo వచ్చిందన్నారు. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్ లో గల చల్ల శ్రీనివాస్ ఇంట్లో గంజాయి ఉందని సమాచారం ఇచ్చారన్నారు. ఉన్నత అధికారులకు తెలియ చేశారు. గవర్నమెంట్ పంచుల  సమక్షంలో డీఎస్ పి  ఉత్తర్వుల మేరకు చల్లా శ్రీనివాస్ ఇంటిని సోదా చేశామన్నారు. ఇంట్లో 3.500 కేజీల గంజాయి దొరికిందన్నారు.

అతన్ని విచారించగా తన అన్న కొడుకు అయినటువంటి చల్ల సతీష్ తన స్నేహితుడు రేపాకుల సాగర్ కలిసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి వారిద్దరూ సీలేరు నుండి గంజాయి తీసుకువచ్చారని తెలిపారు. చల్లా శ్రీనివాస్ కూడా అమ్ము కోవచ్చు అనే ఉద్దేశంతో ఇంట్లో నిల్వ ఉంచగా ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు  బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో చల్ల శ్రీను ఇంట్లో గల 3.500గ్రాముల గంజాయి స్వాధీన పరుచుకొని శ్రీనివాస్ పై మరియు సీలేరు నుండి గంజాయి తీసుకు వస్తున్నటువంటి చల్లా సతీష్ మరియు రేపాకుల సాగర్ పై కేసు నమోదు చేయటం జరిగినది అన్నారు. చల్లా శ్రీనివాసను గురువారం రిమాండ్ పంపించడం జరిగిందన్నారు. గతంలో చల్లా సతీష్ మరియు సాగర్ ల ను ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేయడం జరిగిందన్నారు, ఇట్టి కార్యక్రమం లో సిఐ నాగబాబు ఎస్ ఐ లు మరియు సిబ్బంది పాల్గొనారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -