Friday, May 23, 2025
Homeఎడిట్ పేజిప్రభుత్వ బడిని కాపాడుకోలేమా!?

ప్రభుత్వ బడిని కాపాడుకోలేమా!?

- Advertisement -


ప్రభుత్వ బడిని కాపాడటం, సంస్కరణల కోసం నూతనంగా నియమించిన తెలంగాణా విద్యాకమిషన్‌ సర్కార్‌కు కొన్ని సూచ నలు చేసింది. బడీడు పిల్లల కోసం ఇప్పుడున్న ప్రభుత్వ బడుల స్థానంలో నర్సరీ నుండి రెండవతరగతి వరకు ”తెలంగాణా ఫౌండేషన్‌ స్కూల్‌” మండ లానికి నాలుగు ఏర్పాటు చేయాలని,” నర్సరీ నుండి ఇంటర్‌ వరకు ”తెలం గాణా పబ్లిక్‌ స్కూల్‌” మండలానికి కనీసం మూడు చొప్పున ఏర్పరచాలని సిఫార్సు చేసింది, అంతే కాదు, 2025-26 విద్యా సంవ త్సరం నుంచి 2029-30కి ఈ ప్రణాళిక ముగిసేలా ఆర్థిక అంచనా కూడా ఇచ్చింది. మండలంలో నాలుగు ఫౌండేషన్‌ స్కూల్‌కు 3.5 కోట్ల చొప్పున 14కోట్లు, మూడు పబ్లిక్‌ పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు 12కోట్ల చొప్పున 36కోట్లు వెరసి మండలానికి 50కోట్ల రూపాయలు ఖర్చు అంచనా వేసింది. ఈ లెక్కన 2025-26 ఏడాదికి గానూ వంద మండ లాలు ప్రభుత్వ బడులు తీసుకుంటే ఈఏడాది 5వేల కోట్లు ఖర్చుచేయాలి.బడ్జెట్‌ కంటేముందే ప్రభుత్వానికి తెలంగాణా విద్యాకమిషన్‌ నివేదిక ఇచ్చినా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. మరి ప్రభుత్వ పాఠశాల సంస్కరణ ఎలా జరుగుతుంది? ఇంకా పాఠశాల యాక్సెస్‌ కోసం విద్యాకమిషన్‌ పలు సూచనలు చేసింది. క్యాచ్‌మెంట్‌ ఏరియా నుండి పాఠశాల వరకు అవసరమైతే ట్రాన్స్‌పోర్టు సౌకర్యం ఏర్పాటు చేయాలని సిపార్సు చేసింది. ఈ సిపార్సు కొత్తదేమీకాదు! సర్వ శిక్షాఅభియాన్‌ ఇంతకు ముందు యాక్సెస్‌లెస్‌ పాఠశాలలకు సిపార్సు చేసిన ట్రాన్స్‌పోర్ట్‌ సౌకర్యాన్నే తాజాగా కమిటీ సిఫార్సు చేసింది. దశాబ్దంన్నర క్రితమే సర్వ శిక్షా అభియాన్‌ ఈ సిపార్సు చేసింది. అయినా పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఆ పథకం అమలు కాలేదు? ఇప్పుడు మినీబస్సులు,ఆటోలు నిరుద్యోగులకు ఇచ్చి ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం అనే ఒక మంచి ఆలోచన తెలంగాణా విద్యా కమిషన్‌ చేసింది.ఇక గ్రామాలు, పట్టణం మురికివాడల్లో ఉన్న ఈ వేలాది ప్రభుత్వ పాఠశాలకువిలువైన భూములు న్నాయి. కొన్ని దశాబ్దాలు గా కోట్లాది రూపాయలు వెచ్చించి సర్వశిక్షా అభియాన్‌ కట్టిన భవనాలూ ఉన్నాయి. ఇంటర్నెట్‌తో పాటు కంప్యూటర్‌ సౌక ర్యాలు, లేబొరేటరీ సౌకర్యాలు సైతం ఈ పాఠశాలల్లో అంతంత మాత్రమే. బోధించడానికి నిష్ణాతు లైన, శిక్షణ పొందిన ఉపాధ్యా యులు ఉన్నారు. కానీ! ”అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు” పాఠశాలలో చదువుకునే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ దిగజారి పోతు న్నది. అందులో నూటికి నూరు శాతం పర్యవేక్షణా లోపమే. ప్రభుత్వ పాఠశాల ఏరియాలో పిల్లలు లేరా? ఉన్నారు.కానీ,వారు ప్రభుత్వ పాఠశాల దాటి బస్సుల్లో ప్రయివేటుకు వెళ్తున్నారు. మరికొందరు హాస్టల్‌ సౌకర్యం ఉన్న రెసిడెన్షియల్‌ పాఠశాలల బాట పడుతున్నారు.
పాలకులు ఎవరు అధికారంలోకి వచ్చినా కొన్ని దశాబ్దాలుగా ఓ చిత్రమైన వైఖరిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ముప్పై వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కేటాయించడం కష్టమని, కొద్ది నిధులతో ప్రజల కోసం తామేదో విద్యావ్యవస్థలో కొత్త ప్రయోగం చేస్తున్నట్లు నటిస్తు న్నారు.అరకొర రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రక టించి ప్రభుత్వ పాఠశాలలో నమోదును, విద్యార్థుల సంఖ్యను తగ్గించి దెబ్బ తీస్తున్నారు? ప్రజల్ని మసి భూసి మభ్యపెడుతున్నారు? తక్కువ బడ్జెట్‌తో ఉన్నత ఫలితాలు తీసుకొస్తున్నామని చెప్పుకోవడా నికి పనికొస్తాయి తప్ప ఇలాంటి ప్రయోగాల్లో చిత్త శుద్ధి కనపడదు! వీటితో ప్రజలకు ఎలాంటి ఉప యోగం ఉండదని ఇప్పటికే ఆయా వ్యవస్థలు నిరూ పించాయి. అంతిమ సారాంశం ఏమిమంటే సకల సౌకర్యాలున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువు కోవాల్సిన విద్యార్థులను అటు ప్రయివేటు పాఠశాల వ్యవస్థ, ఇటు గమ్యమేమిటో అర్థం కానీ ప్రత్యేక పాఠశాలల ఏర్పాటు, వెరసి రాష్ట్రంలో ఉన్న ముప్పై వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్లో సగానికిపైగా మూతపడే దిశగా ప్రయా ణం కొనసాగుతున్నాయి. 2023-24 ప్రభుత్వ విద్యా గణాంకాల్ని అనుసరించి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ప్రాథమిక పాఠశాలలు 19,734, ప్రాథమి కోన్నత 3,237, ఉన్నత 4843, రెసిడెన్షి యల్‌ 403, వీటికి అదనంగా ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలు మరో 662 ఉన్నాయి. మొత్తంగా 30,684 ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం మనుగడలో ఉన్నాయి.ఇక ప్రయివేటు రంగంలో గుర్తింపు పొందిన 12,126 పాఠ శాలలుండగా ఇందులో అత్యధికంగా ఆరువేల పైచిలుకు ప్రాథ మిక పాఠశాలలతో కూడిన ఉన్నత పాఠశాలలే!? ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిరకాల శిక్షణ పొందిన, సబ్జెక్టు నైపుణ్యం కలిగిన 1,48, 456 మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా, కేవలం పన్నెండు వేల ప్రయివేటు రంగంలోని పాఠ శాలల్లో సరైన కనీస వేతనంగానీ, సరైన శిక్షణగానీ, చాలా మందిలో కనీసం నైపుణ్యంగానీ లేని1,89, 438 మంది ప్రయివేటు ఉపాధ్యాయులు ఉన్నారు.
అంతేకాదు, ప్రభుత్వ పాఠశాలలో ప్రతి19 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉంటే, ప్రయివేటు పాఠశాలలో ఆసంఖ్య 24గా ఉంది. అంటే ఇక్కడ ప్రయివేటు యాజమాన్యాలు లాభాలే ధ్యేయంగా పని చేయడంతో పాటు ఉపాధ్యాయులకు తక్కువ వేతనాలిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నట్లు ప్రభు త్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.ఇక ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అనాలోచిత అసమతూల్యత ఉంటున్నది. విద్యార్థులు అత్యధికంగా ఉన్న వందల రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అరకొర వేతనాలతో పని చేసే ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఎక్కువ సంఖ్య లో విద్యార్థులు ఉండగా, రాష్ట్రంలోని ఐదు వేల పైచిలుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అన్ని రకాల అర్హత, నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు న్నప్పటికీ సరైన సంఖ్యలో విద్యార్థుల నమోదు లేదు? ఈ అగాదానికి మూలం ముందు చూపు లేని, తాత్కా లిక ప్రచారం పటాటోప చర్యలే. దశా బ్దాలుగా ప్రభుత్వ పాఠశాల వ్యవస్థపై కొనసాగు తున్న వివక్షతోపాటు, పరోక్షంగా ప్రయివేటు విద్యా వ్యవస్థను ప్రొత్సహించి విద్యా,ఉద్యోగ బాధ్యతల నుండి వైదొలిగే చర్యల్లో పాలకులు నిమగమ వ్వడమే. ప్రభుత్వ విద్యారంగంలో ఉన్న పాఠశాల లు స్థితిగతులు గాలికొదిలి కొత్తదనం, ఎక్సలెన్సీ పేరుతో ప్రభుత్వ పాఠశాలకు సమాంతరంగా వివిధ రకాల రెసిడెన్షియల్‌ పాఠశాల వ్యవస్థను ఏర్పరచడం ప్రభుత్వ పాఠశాలలకు మరో శాపంగా మారింది. కొత్తగా ఏర్పాటు చేసిన గురుకులాలు తప్పని కాదు, కానీ అదే స్థాయిలో ప్రభుత్వ పాఠశా లలను కూడా బలోపేతానికి చర్యలు తీసుకోక పోవడం ప్రధాన లోపం. ప్రభుత్వ విద్యారంగం అస్తవ్యస్తం మూలంగానే సమా జంలో కుల,మత, ప్రాంతీయ వైషమ్య బీజాలతో పాటు శరీరక శ్రమపట్ల సరైన గౌరవం, క్రమశిక్షణ లోపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతపాటు సామాజిక అవగాహన, వ్యక్తిత్వ వికాసం, సవాళ్లను ఎదుర్కొనే శక్తి విద్యార్థుల్లో సహజ సిద్ధంగా అలవడుతుందన్న విషయం పాలకులు గుర్తించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో గుర్తించి వాటిని సరిదిద్ది విద్యార్థుల నమోదుకు అవసరమైన చర్యలు తీసుకోవడం, నాణ్యమైన భోజన వసతులు ఏర్పాటు చేయడం, మరికొన్ని పాఠశా లలకు ఉచిత రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం లాంటి విద్యాకమిషన్‌ సూచనలు పరిగణనలోకి తీసుకోవా ల్సినవే. ఇప్పటికే బడిబాట కార్యక్రమం, జూన్‌ 12నుంచి పాఠశాలలు ప్రార ంభం కానున్న నేపథ్యంలో కమిటీ సిఫార్సులపై విద్యాశాఖ సమగ్ర కసరత్తు చేయాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభు త్వం విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు ఆలోచనలు, సలహాలు తీసుకోవడం కూడా అవసరం. తెలంగాణా విద్యా కమిషన్‌ నివేదిక బుట్టదాఖలు కాకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల నమోదు పెంచే దిశగా అడుగులు వేయాలి. అలాగే రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు కనీసం ఇరవై శాతం నిధులు కేటాయించాలి. అందరికీ సమానమైనది ప్రభుత్వ విద్య మాత్రమే. అదే ఆయా కుటుంబాల దశదిశ మారుస్తుంది. తద్వారా దేశంలో పరిపూర్ణ మానవ వనరుల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. దేశ ప్రతిష్టను పెంచేందుకు సహకరిస్తుంది.
ఎన్‌.తిర్మల్‌,
9441864514

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -