- Advertisement -
మహిళల ప్రీమియర్ లీగ్ 2026
న్యూఢిల్లీ : భారత స్టార్ బ్యాటర్ జెమీమా రొడ్రిగ్స్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించనుంది. తొలి మూడు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్స్‌కు చేర్చిన మెగ్ లానింగ్ స్థానంలో జెమీమా రొడ్రిగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుంది. మూడు సీజన్లుగా క్యాపిటల్స్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రొడ్రిగ్స్.. నాయకత్వ పగ్గాలు అందుకుంది. ఈ ఏడాది ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై జెమీమా రొడ్రిగ్స్ అద్వితీయ శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే.
- Advertisement -



